ఏఎంసి చైర్మన్-సింగిల్ విండో చైర్మన్ల ను సన్మానించిన గంగాపుత్ర సంఘ సభ్యులు
గంభీరావుపేట : గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన మహమ్మద్ హమీద్ గారికి మరియు పాక్స్ చైర్మన్ వేషాల వెంకటి గారిని మంగళవారం వారి స్వగృహంలోగంభీరావుపేట గ్రామానికి సంబంధించిన గంగపుత్ర సంఘం నాయకులు శాలువాతో సన్మానించి స్వీట్లు తినిపించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ, సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు .
ప్రజా జీవితంలో నేను ఎప్పుడూ ప్రజల అవసరాలను తీర్చడంలో ముందుంటానని,ఏ అవసరం ఉన్న తనకు సంప్రదించ వలసిందిగా తెలిపారు . ఈ సందర్భంగా గంగపుత్ర సంఘ నాయకులు హమీద్ కి మరిన్ని పదవులతో అలంకరింపబడాలని దీవించారు.ఈ కార్యక్రమంలో కరువారి శంకర్, చింతకింది రామచంద్రం, గుండెలి నరేష్ , దుంపల దేవయ్య ,దేశవేని నర్సింలు, కామునిరాములు ,గుండెల్ని దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


