ఇషా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
.jpeg)
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
హన్మకొండ న్యూస్ : హనుమకొండ నక్కల గుట్ట లోని వాటర్ ట్యాంక్ సమీపంలో గల బి కే రెడ్డి కాలనీలో గల వశిష్ట అపార్ట్మెంట్ లో ఇషా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు ను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని కాలనీవాసులు వినియోగించుకోవాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నిషా హాస్పిటల్స్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్ ,జనరల్ సర్జన్, కార్డియాక్ సర్జన్, పీడియాట్రిషన్, ఆర్థోపెడిక్ సంబంధిత ప్రముఖమైన వైద్యులు పాల్గొన్నారు.ఈ వైద్య శిబిరాన్ని 250 మంది పాల్గొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నీలిమ, 51వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కరీం, ఇన్చార్జి లక్ష్మారెడ్డి , బి కే రెడ్డి కాలనీ అధ్యక్షులు వినయ్ రెడ్డి, ప్రముఖ వైద్యులు రామకృష్ణారెడ్డి, శ్రీరామ్ రెడ్డి తోపాటు ఇషా హాస్పిటల్స్ వైద్యులు కాంగ్రెస్ కార్యకర్తలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


