ఇన్‌ఫోర్టెకార్ప్–ప్రాక్సియన్ టెక్–ఫైడైమెన్షన్స్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం..

హైదరాబాద్/లండన్ : ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ మరియు హై-టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఇన్‌ఫోర్టెకార్ప్ సొల్యూషన్స్ లిమిటెడ్ (యుకే), ప్రాక్సియన్ టెక్, ఫైడైమెన్షన్స్ సంస్థలు త్రైపాక్షిక వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్, యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్ తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్, ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో ఉద్భవిస్తున్న అవకాశాలను సంయుక్తంగా వినియోగించుకోవాలని సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఒప్పందం ప్రకారం ఇన్‌ఫోర్టెకార్ప్ సంస్థ తన గ్లోబల్ మార్కెట్ యాక్సెస్, వ్యూహాత్మక భాగస్వామ్యాలు మరియు ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలను వినియోగించనుంది. ప్రాక్సియన్ టెక్ అధునాతన ఇంజినీరింగ్, డిజైన్ మరియు ఇన్నోవేషన్ ఆధారిత టెక్నాలజీ అభివృద్ధిలో తన నైపుణ్యాన్ని అందించనుంది. ఫైడైమెన్షన్స్ ఐటీ, ఐటీఈఎస్, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ మరియు క్లిష్టమైన టెక్నాలజీ ప్రాజెక్టుల అమలులో సహకారం అందించనుంది.
ఈ భాగస్వామ్యం ద్వారా ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాల్లో వ్యూహాత్మక ప్రాజెక్టులు, టెండర్లను సంయుక్తంగా సాధించడం, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, స్వదేశీకరణ, లోకలైజేషన్‌కు ప్రోత్సాహం ఇవ్వడం, గ్లోబల్ OEMలు మరియు ప్రభుత్వ ఖాతాదారులకు మిషన్-క్రిటికల్ సొల్యూషన్లు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇన్‌ఫోర్టెకార్ప్ సొల్యూషన్స్ లిమిటెడ్ కో-ఫౌండర్ (ఏరోస్పేస్ & డిఫెన్స్ – యుకే & ఓవర్సీస్) రాజు కీర్చిపల్లి మాట్లాడుతూ, ఈ ఒప్పందం ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో విశ్వసనీయమైన ఎకోసిస్టమ్ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు. మూడు సంస్థల సమిష్టి బలాలతో ప్రపంచ స్థాయి, నాణ్యమైన పరిష్కారాలను అందించగలుగుతామని పేర్కొన్నారు. ప్రాక్సియన్ టెక్, ఫైడైమెన్షన్స్ ప్రతినిధులు కూడా ఈ భాగస్వామ్యం డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉండటంతో పాటు, దీర్ఘకాలిక వృద్ధి, స్థిరత్వానికి దోహదపడుతుందని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


