అచ్చంపేటలో ఘోరం. వైద్యం వికటించి బాలింతరాలు మృతి

వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పద్మ మృతి చెందినట్లు బంధువుల ఆందోళన

అచ్చంపేటలో ఘోరం.  వైద్యం వికటించి   బాలింతరాలు మృతి

 ప్రధాన రహదారిపై  బైఠాయింపు 

అచ్చంపేట (నాగర్కర్నూల్ జిల్లా)  : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని లింగాల రోడ్డు యందు ఉన్న భవాని హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల వైద్యం వికటించి బాలింతరాలు మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు బల్మూర్ మండలంలోని పోలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన పద్మ గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో డెలివరీ కోసం భవాని హాస్పిటల్కు రావడం జరిగింది ఆదివారం గర్భిణి స్త్రీ డెలివరీ అనంతరం పసిబిడ్డకు జన్మించిన తల్లి పరిస్థితి బాగా లేకపోవడంతో భవాని హాస్పిటల్  వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ హాస్పిటల్కు పేపర్ చేశారు అక్కడ పద్మ చికిత్స పొందుతూ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు భవాని హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యం వల్లనే బాలింతరాలు పద్మ మృతి చెందిందని మంగళవారం అచ్చంపేట పట్టణంలో భవాని హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు అనంతరం లింగాల చౌరస్తాలో బంధువులు పెద్ద ఎత్తున బైఠాయించి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేశారు కొంతసేపు తీవ్ర ఆందోళన పరిస్థితి నెలకొంది పోలీసులు ఆస్పిటల్ వద్ద ఆందోళన చేస్తున్న సంఘటన వద్దకు వచ్చి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం