ప్రజావాణిలో 64 వినతులు స్వీకరణ
- కాలువలు, డ్రైన్లు, పారిశుధ్య సమస్యలే అధికం
- సత్వర పరిష్కారానికి అధికారులకు మేయర్ ఆదేశాలు
కొత్తగూడెం : కొత్తగూడెం నగరపాలక సంస్థలో బుధవారం (ఆగస్టు 5) ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు గౌరవ మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తూ మొత్తం 64 దరఖాస్తులు సమర్పించారు.వినతుల్లో అత్యధికంగా కాలువలు, డ్రైన్ల నిర్మాణం, పారిశుధ్య సమస్యలు, డ్రైన్ల శుభ్రతకు సంబంధించిన ఫిర్యాదులే నమోదయ్యాయి. ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను ప్రాధాన్యతతో తీసుకుని వీలైనంత త్వరగా పరిష్కరించాలని మేయర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే కొత్తగూడెం నగరపాలక సంస్థలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. సుజాత, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఆర్.ఆర్. విజయనందతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Views: 72
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
