బిజినపల్లి ఆల్ సెయింట్స్ స్కూల్‌లో HPV వ్యాక్సినేషన్ అవగాహన కార్యక్రమం

గర్భాశయ క్యాన్సర్ నివారణపై విద్యార్థినులకు అవగాహన

బిజినపల్లి ఆల్ సెయింట్స్ స్కూల్‌లో HPV వ్యాక్సినేషన్ అవగాహన కార్యక్రమం

నాగర్ కర్నూలు /బిజినపల్లి : బిజినపల్లి పట్టణంలోని ఆల్ సెయింట్స్ మోడల్ హైస్కూల్ లో బుధవారం HPV వ్యాక్సినేషన్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి *వైద్యాధికారి డా. సృజన ముఖ్య అతిథిగా హాజరై HPV వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.HPV వైరస్ వల్ల వచ్చే ప్రమాదాలు,గర్భాశయ క్యాన్సర్ గురించి క్లుప్తంగా వివరించారు.అనంతరం 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఈ టీకా వేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ నివారణలో ఎంతో కీలకం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం జోసఫ్, రీతూ, హెల్త్ సూపర్‌వైజర్ బి.సుజాత,ANM స్వేత,ఆశా వర్కర్లు చెన్నమ్మ,సరస్వతి పాల్గొని విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేశారు. విద్యార్థినులు ఆసక్తిగా విని, తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పాఠశాల యాజమాన్యం జోసఫ్,రీతూ అన్నారు. పాఠశాలలకు విచ్చేసి తమ విద్యార్థులకుHPV వ్యాక్సిన్ యొక్క ఉపయోగాలు వివరించేందుకు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు 
Views: 39

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు