పోలీసు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోస్టర్ల ఆవిష్కరణ.
సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సూచన.
నాగర్ కర్నూల్ : బ్యాంకర్లు, అసోసియేషన్ సభ్యులు, సైబర్ బాధితులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించిన ఎస్పీ.ఇన్‌పర్సోనేషన్, కార్డు ఫ్రాడ్స్, ఈ-కామర్స్ మోసాలు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, నకిలీ లోన్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉద్యోగాల పేరుతో రుగుతున్న జాబ్ ఫ్రాడ్స్ పట్ల నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వొద్దని ప్రజలకు ఎస్పి సూచించారు.సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.సమీప పోలీస్ స్టేషన్‌లోని సైబర్ క్రైమ్ వారియర్‌ను సంప్రదించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.సైబర్ మోసం జరిగిన వెంటనే సంబంధిత బ్యాంకు టోల్‌ఫ్రీ నంబర్‌కు కూడా సమాచారం ఇవ్వాలని సూచన చేశారు.ప్రతి బ్యాంకు, ప్రతి సంస్థలో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బ్యాంకర్లు, అసోసియేషన్ ప్రతినిధులకు ఎస్పీ పిలుపునిచ్చారు.అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 'సైబర్ మోసాల బారినపడబోమని ప్రతిజ్ఞ చేసినారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ అధికారులు, జిల్లా పోలీసు సిబ్బంది, సైబర్ క్రైమ్ టీం సభ్యులు పాల్గొన్నారు.
Views: 14
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
