దామర భీమనపల్లిలో ఆగని అక్రమ నిర్మాణాలు

దామర భీమనపల్లిలో ఆగని అక్రమ నిర్మాణాలు

అనుమతులు లేని ‘కోళ్ల ఫారాల’పై అధికారుల చోద్యం.
నోటీసులతో చేతులు దులుపుకున్న పంచాయతీ రాజ్

నల్గొండ జిల్లా / మర్రిగూడ : నిబంధనలకు విరుద్ధంగా,ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా గ్రామం నడిబొడ్డున వెలుస్తున్న అక్రమ కోళ్ల ఫారాలపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ఆపాలంటూ గ్రామస్తులు క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది.అధికారులు కేవలం నోటీసులకే పరిమితం కావడంతో, యజమాని మరింత బరితెగించి నిర్మాణ పనుల వేగాన్ని పెంచారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నోటీసులతో చేతులు దులుపుకున్న పంచాయతీ రాజ్!
దామేర భీమనపల్లి గ్రామ పరిధిలో సాగుతున్న ఈ అక్రమ కోళ్ల ఫారం వ్యవహారంపై పంచాయతీ కార్యదర్శి కేవలం ఒక నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా సమాచార హక్కు చట్టం కింద గ్రామస్తులు దరఖాస్తు చేసుకోగా ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి సంచలన నిజాన్ని అంగీకరించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.సదరు కోళ్ల ఫారానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని,కేవలం అనుమతులు తెచ్చుకోవడానికి మాత్రమే నిరభ్యంతర పత్రం ఇచ్చామని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.అనుమతులు లేవని స్వయంగా అధికారులే ఒప్పుకుంటున్నా ఆ అక్రమ నిర్మాణాలను ఆపడానికి గానీ, కూల్చివేయడానికి గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
సహకరిస్తున్న అధికారులు.. చట్టాన్ని అపహాస్యం చేస్తున్న యజమాని!?
ఇప్పటికే ఎలాంటి అనుమతులు లేకుండా ఒక కోళ్ల ఫారం నిర్మాణం పూర్తి చేసి, అందులో వ్యాపారాన్ని కూడా విజయవంతంగా నడిపిస్తున్నారని,ఇప్పుడు దానికి అదనంగా మరికొన్ని కోళ్ల ఫారాలను, గోడౌన్లను, అక్కడ పనిచేసే లేబర్ కోసం నివాస సముదాయాలను నిర్మిస్తున్నారు.గత నెల రోజులుగా ప్రతిరోజూ 40 నుండి 50 మంది కూలీలతో పనులు చకచకా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.మండల అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అధికారుల పరోక్ష సహకారంతోనే యజమాని ఎలాంటి భయం లేకుండా చట్టాన్ని అపహాస్యం చేస్తున్నాడని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.
దుర్వాసన, రోగాల బారిన పడుతున్న గ్రామం...
కోళ్ల ఫారాల నుండి వస్తున్న తీవ్రమైన దుర్వాసన, విపరీతంగా పెరుగుతున్న దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాల వల్ల గ్రామం రోగాల మయంగా మారింది. ఇప్పటికే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, పిల్లలు ఈ కాలుష్యం తట్టుకోలేక అకాల మృత్యువాత పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ఫారాన్ని తక్షణమే మూసివేయాలని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు.
కలెక్టర్ గారైనా స్పందించేనా..?
స్థానిక అధికారులు పూర్తిగా చేతులెత్తేసిన వేళ, ఇప్పుడు దామేర భీమనపల్లి గ్రామ ప్రజల ఆశలన్నీ నల్గొండ జిల్లా కలెక్టర్ గారిపైనే ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని, క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, అనుమతులు లేని ఆ అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసి, గ్రామ ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు.
 
1003138580
 
Views: 225

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు