సీనియర్ కాంగ్రెస్ నాయకుడి మృతికి ఎమ్మెల్యే సంతాపం
మన్నెం ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం ఇచ్చిన ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి
బిజినపల్లి (నాగర్ కర్నూల్) : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుమ్మరి మన్నెం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి మన్నెం కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి అని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు మారేపల్లి శివలీల, చంద్ర గౌడ్, గిరిజన సంఘం నాయకులు మూడవతు గోవింద్ నాయక్, మాన్య నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, తండా సర్పంచులు మునీందర్ నాయక్, కృష్ణ నాయక్, పులియా నాయక్, జాలం నాగయ్య, లేట్ల బాలస్వామి, రవి నాయక్, పండు నాయక్, చందూలాల్ నాయక్, సింగల్ విండో డైరెక్టర్లు ఎండి నజీర్, వాలియా నాయక్, మాజీ సర్పంచులు గంగనముని తిరుపతయ్య, అమృత్ రెడ్డి, బాలరాజు, రామచంద్రయ్య, సింగల్ విండో చైర్మన్ ఎం. వెంకటస్వామి, ఎండి ముక్తార్, శ్రీనివాస్ గౌడ్, రాము యాదవ్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

