బాల్కొండ లో అక్రమ నిర్మాణలపై అధికారుల మౌనం ?
నిజామాబాద్ స్పెషల్ ప్రతినిధి :- బాల్కొండ లో స్థానిక బి. ఆర్ ఎస్ ముఖ్య నాయకులు బాల్కొండ గ్రామ పంచాయతికి చెందిన "ఓపెన్ ప్లాట్స్ లో "అక్రమ నిర్మాణలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఇందులో ఏం మతాలబు ఉందోనని స్థానిక పౌరులు ప్రశ్నిస్తున్నారు.
కలెక్టర్ ఉత్తరవ్యూల్ని తారు మారా ?
1974లో గ్రామపంచాయతీ కి చెందిన భూముల్ని 1974లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న బి.కే. పెంటయ్య ఐఏఎస్ అనుమతితో ఓపెన్ టెండార్లో వేలం పాటలో పాల్గొని ప్లాట్స్ కొనగా మిగిలిన పెద్ద పెద్ద బండరాళ్లు కూడిన ఆరు ప్లాట్లు ఓపెన్ ప్లేస్ గ ఉంచారు. ఇదే భూమి నేటి విలువ (05)కోట్లు ఉండవచ్చు ఇదే భూములో స్థానిక బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తుoడగా దీనికి
సర్వే నుంబర్ ఎమి ఇచ్చారు ?
ఏ ఇంటి నుంబరుకు బై ఇచ్చారా ? పైగా " గ్రామ సెక్రటరీ ఓనర్ షిప్ సర్టిఫికెట్ " ఎలా ఇచ్చారో నని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కమ్మర్పల్లి లాగ బాల్కొండ లో కాంగ్రెస్ పార్టీ వాళ్లు లేరా ?
ఇటీవల కమ్మర్పల్లి మండల కేంద్రంలో లో (09)కోట్ల రూపాయల విలువ గల (33) గుంటల ప్రభుత్వ భూమిని భూకబ్జా దారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే అదే భూమిని కాంగ్రెస్ పార్టీ వారు స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్న వి.డి.సి వాళ్లకు ఆ భూమిని అప్పగించారు ఇలాంటి పద్ధతి బాల్కొండలో ఎందుకు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బాల్కొండ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇందులో ఏవైనా లోపాయి కారి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా,అని
స్థానిక యువకులు ప్రజలు
గుస..గుస..లాడుచు చర్చించు కుంటున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


