ముడ నమ్మకాలు నమ్మి ఇద్దరు మృతి

ముడ నమ్మకాలు నమ్మి ఇద్దరు మృతి

కామారెడ్డి బ్యూరో  :  కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలం లింగైపల్లి కి చెందిన సోమిశెట్టి రజిత,తండ్రి టేక్రియల్ వాసి పెద్ద నరసయ్య లు ముడ నమ్మకాలు నమ్మి మృతి చెందారు. దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.లింగైపల్లి కి చెందిన సోమిశెట్టి రజిత భర్త మల్లేశం గత 2 నెలల క్రితం యాక్సిడెంట్ అయ్యింది.ఆరోగ్యం బాగా లేకపోవడంతో, ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతనికి ఆరోగ్యం బాగా లేకపోవటం తో అతనికి దిష్టి తీయాలనే ఆలోచనతో, సోమిశెట్టి రజిత యొక్క తండ్రి, టేక్రియల్ కు చెందిన పెద్ద నరసయ్య కూతురు ఇంటికి గురువారం లింగైపల్లి కి వచ్చి రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో మల్లేశంకు దిష్టి తీసి, చెరువులో దిష్టిని వేయడానికి రజిత, ఆమె తండ్రి సుంకరి పెద్ద నరసయ్య లు కొట్టాల్ పల్లి చెరువు వద్దకు వెళ్లి, దిష్టి పడవేసి క్రమంలో, చెరువు లోతు ఎక్కువగా ఉండటం వల్ల, ప్రమాదవశాత్తు ఇద్దరు అందులో పడి మరణించినట్లు తెలిపారు.

Views: 197

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News