తాడిచర్లలో వీవో బిల్డింగ్ నిర్మాణానికి భూమిపూజ
మహిళా సంఘాల బలోపేతానికి మరో ముందడుగు
మల్హర్ : మల్హర్ మండలంలోని తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం వీవో (VO) బిల్డింగ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఎంపీడీవో క్రాంతి కుమార్, ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు, ఎంపీఓ, వార్డు సభ్యులు, కామ బాబు, నిఖిల్ రావు, తిర్రి అశోక్, ఇందారం నరసయ్య, చోటే వెంకటేష్, సురం స్వప్న, శ్యామల తదితరులు పాల్గొన్నారు. అలాగే సీఏలు, మహిళా సంఘాలకు చెందిన సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు కలిసి వీవో భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మహిళా సంఘాల కార్యకలాపాలకు సొంత భవనం అందుబాటులోకి రానుండటంతో సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

