విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి
మక్తల్ లేడీ ఎస్సే రేవతి
మక్తల్ : తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాకేష్ అగర్వాల్, పిఎన్. వెంకటేష్ ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఉదయం 10 గంటలకు మక్తల్ సాయి జ్యోతి ఉన్నత పాఠశాల మక్తల్ లో జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల టెన్నికాయిట్ పోటీలను మక్తల్ మహిళ ఎస్సై రేవతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.గోపాలం బాల బాలికలను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించి ,వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని వారు తెలిపారు. ఎస్సై రేవతి మాట్లాడుతూ రిటైర్డ్ పి ఈ టి బి .గోపాలం సొంత ఖర్చులతో క్రీడల నిర్వహించడం అభినందనీయమని ఆమె తెలిపారు. బి.గోపాలం మాట్లాడుతూ ఈ పోటీలలో క్రీడా నైపుణ్యతను ప్రదర్శించిన బాలబాలికలను ఎంపిక చేసి నవంబర్ 1న హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేడియం గ్రౌండ్లో జరుగు రాష్ట్రస్థాయి టెన్నికైట్ పోటీలకు పంపుతామని ఆయన తెలిపారు. ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుండి మద్దూర్, దామరగిద్ద, నారాయణపేట్, నర్వ, ఊట్కూర్ ,మక్తల్, మాగనూర్, ధన్వాడ, మరికల్ నుండి 126 మంది బాలబాలికలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి. దీప, పాఠశాల ప్రిన్సిపల్ జూమ్లీ, పి డి, పి ఈ టి లు శశికళ, శ్రీలత ,దేవకమ్మ, రమ్య, మమత, హేమలత ,స్వప్న, అవంతిక ,వెంకటేష్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


