బాలల హక్కులు రక్షణ చుట్టాల పై అవగాహన కల్పించిన సివిల్ జడ్జి

బాలల హక్కులు రక్షణ చుట్టాల పై అవగాహన కల్పించిన సివిల్ జడ్జి

బాన్సువాడ : బాలల హక్కులు రక్షణ చట్టాల పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని శుక్రవారం బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ జాడ వినీల్ కుమార్ అన్నారు. బోర్లం గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో సురక్షిత బచ్చన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథి గా విచ్చేసి మాట్లాడడం జరిగింది. జడ్జి జాడ వినీల్ కుమార్ మాట్లాడుతూ. బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టం, గుడ్ టచ్ బాడ్ టచ్, సైబర్ నేరాలు, భద్రత పై విద్యార్థుల కు అవగాహన కలిగించారు. ఆపద లో ఉన్న బాలలు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 ను సంప్రదించా లని సూచించారు. బాలికలకు చట్టపరమైన రక్షణలో వివరించే వాల్పోస్టర్ల ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిషోర్ కుమార్ సీనియర్ అడ్వకేట్స్ హమీద్, అర్షద్ పాఠశాల ప్రధానో పాధ్యాయులు వెంకటరమణ, పారాలీగల్ వాలంటర్ అయ్యల సంతోష్, ఉపాధ్యాయ బృందం, కోర్టు సిబ్బంది లక్ష్మణ్, ఫారుక్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీజీఎస్nఆర్టీసీ  రీజియన్లో రోడ్డు భద్రత ప్రమాదాల  నివారణపై శిక్షణ కార్యక్రమం టీజీఎస్nఆర్టీసీ రీజియన్లో రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై శిక్షణ కార్యక్రమం
నిజామాబాద్ :  టీ.జీ.ఎస్. ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కాన్ఫెరెన్స్ హాల్ లో డ్రైవర్లకు రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ...
ఫత్లాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం
స్క్రాప్ దుకాణం ప్రారంభించిన పాలకుర్తి సారంగపాణి
చెరువులో పడిన వ్యక్తి మృతి
అల్లాదుర్గంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఇంటర్ జోనల్ టీ20లో మెదక్ పోలీసుల సత్తా
మనోహరాబాద్ రైతు వేదికలో పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం