డ్రంకన్ డ్రైవ్లో ఇద్దరికి ఏడురోజుల జైలు.
నిజామాబాద్ : డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం ఏడు రోజుల జైలుశిక్ష విధించింది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ టౌన్-1 పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు దమ్ము నవీన్, నసీరుద్దీన్ మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. వీరిద్దరిని కోర్టులో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా.. ఇద్దరికీ ఒక్కొక్కరికి ఏడు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా టౌన్-1 పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


