కర్ణాటక గవర్నర్ సుధా యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తల్లోజు ఆచారి
ప్రముఖుల సమక్షంలో ఆత్మీయంగా సాగిన విందు కార్యక్రమం
కల్వకుర్తి(నాగర్ కర్నూలు) : తెలంగాణకు విచ్చేసిన కర్ణాటక గవర్నర్ డా. సుధా యాదవ్‌ను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో కర్ణాటక గవర్నర్ డా. సుధా యాదవ్‌కు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి తల్లోజు ఆచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ నాయకులు, విశిష్ట వ్యక్తులు హాజరయ్యారు. ప్రముఖుల సమక్షంలో విందు కార్యక్రమం ఆత్మీయంగా సాగింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


