సకల శుభాల ఉసిరి.. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు!

భక్తి, ఆరోగ్యం, ప్రకృతి వైభవానికి ప్రతీకగా ఉసిరి చెట్టు

సకల శుభాల ఉసిరి.. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు!

నాగర్ కర్నూలు : కార్తీక మాసం అంటేనే భక్తి, దీపాలు, పుణ్యస్నానాల మాసం. ఈ మాసంలో ఉసిరి చెట్టుకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఉసిరి చెట్టును పూజించడం అత్యంత పవిత్రమని భక్తులు విశ్వసిస్తారు. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కొలువై ఉంటారని పురాణాల్లో చెప్పబడింది. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం, దీపాలు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఉసిరి చెట్టుకు పూజలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేదంలో సంజీవనిగా పేరొందిన ఉసిరికాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం పరిరక్షించబడుతుంది. ఉసిరికి ఆదిశంకరాచార్యుల కనకధారా స్తోత్రంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇచ్చిన ఒక్క ఉసిరికాయకు సంతోషించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందనే పురాణ గాథ ఉసిరి విశిష్టతను మరింత పెంచింది. ఇలా ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యాన్ని అందించే పవిత్ర వృక్షంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు భక్తి, ఆరోగ్యం, ప్రకృతి వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు