ఆదిలాబాద్ జిల్లా,లక్ష్మీపూర్ గ్రామంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం*

81 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 ట్రాక్టర్ల తాత్కాలికంగా స్వాధీనం

ఆదిలాబాద్ జిల్లా,లక్ష్మీపూర్ గ్రామంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం*

పత్రాలు లేని 6 వాహనాలు పోలీస్ స్టేషన్‌కు తరలింపు

బెల్ట్ షాపులో 70 మద్యం బాటిళ్లు స్వాధీనం

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి – అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి*జైనథ్ సీఐ జి. శ్రవణ్

ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో జైనథ్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో విస్తృతంగా ఉదయం 5 గంటల నుండి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా 81 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 ట్రాక్టర్లను తనిఖీ చేశారు. సరైన వాహన పత్రాలు లేని 6 వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి, తదుపరి చర్యలు చేపట్టారు. అదేవిధంగా గ్రామంలోని బెల్ట్ షాపులో 70 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలను కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ ఎస్ఐ పి. గౌతమ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు