గ్రామీణ అభివృద్ధికి మరో ముందడుగు.. మెడిపూర్‌లో యూనియన్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం

ప్రజలకు మరింత చేరువలో బ్యాంకింగ్ సేవలు.. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

గ్రామీణ అభివృద్ధికి మరో ముందడుగు.. మెడిపూర్‌లో యూనియన్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం

తాడూరు(నాగర్ కర్నూల్) : నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం మెడిపూర్ గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి బ్యాంకు శాఖను ప్రారంభించారు. ఈ నూతన బ్యాంకు శాఖ ద్వారా మెడిపూర్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కానున్నాయి. రైతులు, మహిళలు, వ్యాపారులు, విద్యార్థులు మరియు గ్రామీణ ప్రజలకు ఆర్థిక సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి, ప్రజల ఆర్థిక స్వావలంబనకు ఇలాంటి బ్యాంకింగ్ సదుపాయాలు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మల్లయ్య, గ్రామ పెద్దలు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు