వట్టెం - వెలుగొండ రహదారిలో వరి గడ్డి ట్రాక్టర్‌కు అగ్ని ప్రమాదం

కరెంటు వైర్లు తగిలి మంటలు - తప్పిన పెను ముప్పు

వట్టెం - వెలుగొండ రహదారిలో వరి గడ్డి ట్రాక్టర్‌కు అగ్ని ప్రమాదం

బిజినపల్లి (నాగర్ కర్నూలు) : వరి గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్‌కు కరెంటు వైర్లు తగిలి గడ్డి దగ్ధమైన సంఘటన వట్టెం - వెలుగొండ రహదారిలో చోటుచేసుకుంది. వట్టెం గ్రామానికి చెందిన రైతు శివ, తండ్రి పుల్లయ్య, వరి గడ్డిని ట్రాక్టర్‌లో లోడ్ చేసుకుని వట్టెం నుంచి వెలుగొండ వైపు వెళ్తుండగా, మార్గమధ్యలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ వైర్లు గడ్డికి తగిలి షార్ట్ సర్క్యూట్ జరిగి, వైరు గడ్డిలో పడింది. దీంతో క్షణాల్లోనే వరి గడ్డికి మంటలు వ్యాపించాయి.సమయానికి ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్, రైతు శివ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తమై, అందుబాటులో ఉన్న JCB సాయంతో ట్రాక్టర్‌లోని వరి గడ్డిని కిందకు తొలగించారు.అనంతరం సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వరి గడ్డి మాత్రం పూర్తిగా దగ్ధమైంది.

Views: 145

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు