తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు

భూ నిర్వాసితుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యం

తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు

- అధ్యక్షుడు: ఇందారపు విష్ణువర్ధన్

- ఉపాధ్యక్షుడు: ఇందారపు దావిద్


- ప్రధాన కార్యదర్శి: ఇందారపు మహేందర్

మల్హర్ : తాడిచర్ల భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, బాధిత కుటుంబాలకు న్యాయం చేయడమే ప్రధాన లక్ష్యంగా తాడిచర్ల భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. భూ నిర్వాసితుల సమస్యలపై యువత ఐక్యంగా పోరాడుతూ, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు సభ్యులు తెలిపారు.డేంజర్ జోన్ పరిధిలోని భూ నిర్వాసితుల సమస్యలు, పునరావాసం (R&R), పరిహారం, ప్రభుత్వ ఉత్తర్వులు, అర్హతలు తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో పాటు, చట్టబద్ధమైన మార్గాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామనివెల్లడించారు.అసోసియేషన్ నూతన కార్యవర్గం: - అధ్యక్షుడు: ఇందారపు విష్ణువర్ధన్, ఉపాధ్యక్షుడు: ఇందారపు దావిద్ రాజు, ప్రధాన కార్యదర్శి ఇందారపు మహేందర్, కోశాధికారి: అనుముల పవన్,సంయుక్త కార్యదర్శి: ఇందారపు కిరణ్, ఆర్గనైజేషన్ సెక్రటరీ కడారి పవన్ కళ్యాణ్,సమాచార సమన్వయకర్త ఇందారపు రంజిత్,సభ్యులు: ఇందారపు సాగర్, ఇందారపు అనిల్, బీర్నేని అఖిల్ బాబు, అక్కపాక రాకేష్, అక్కపాక ఆకాష్, తొకాల పవన్ కళ్యాణ్, కుంటాల రాకేష్, గడ్డం శశి, కొలుగూరి రాహుల్, మోతె దీక్షిత్. తాడిచర్ల భూ నిర్వాసితులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారి సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు స్పష్టం చేశారు.

fa1ac59a-5d21-4715-8c24-d279996e7ffc

Views: 29

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు