మా చావుకు కోడలు కారణం కాదు - సూసైడ్ నోట్ లో ముగ్గురి ఆవేదన:

మా చావుకు కోడలు కారణం కాదు - సూసైడ్ నోట్ లో ముగ్గురి ఆవేదన:

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నానక్‌రామ్‌గూడ సమీపంలోని గౌలిదొడ్డిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పాలమూరు జిల్లా అచ్చంపేట మండలం తల్లచెరువు గ్రామానికి చెందిన బత్తుల మర్రెడ్డి (65), ఆయన భార్య భారతి (60), కుమారుడు నిశాంత్‌రెడ్డి (38) పదేళ్లుగా నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో ఉంటున్నారు. మర్రెడ్డి రిటైర్డ్ లెక్చరర్, ఆయన భార్య భారతి రిటైర్డ్ బ్యాంకు మేనేజర్. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 17వ ర్యాంకు సాధించిన నిశాంత్‌రెడ్డి ఐఐటీ చదువు పూర్తి చేసి, ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది క్రితం నుంచి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావడంతో మర్రెడ్డి కుటుంబం నానక్‌రామ్‌గూడ నుంచి గౌలిదొడ్డిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీకి మారారు. నాలుగు రోజుల క్రితం మర్రెడ్డి కోడలు తేజస్వినీరెడ్డి తన కుమారుడు ఆరణ్‌తేజ్‌రెడ్డిని తీసుకుని మియాపూర్‌లోని తన అన్న ఇంటికి వెళ్లారు. అప్పటి నుంచి ఇంట్లో మర్రెడ్డి, ఆయన భార్య భారతి, కుమారుడు నిశాంత్‌రెడ్డి ఉంటున్నారు. శనివారం రాత్రి కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ముగ్గురూ ప్రాణాలు తీసుకున్నారు. మర్రెడ్డి తెలుగులో రాసిన ఆ లేఖలో తమ చావుకు కోడలు తేజస్వినీరెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని, ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని రాసినట్టు పోలీసులు తెలిపారు. మనవడు ఆరణ్‌తేజ్‌రెడ్డిని చక్కగా పెంచాలని కోడలిని కోరుతూ రాసిన లేఖలో కింద ముగ్గురి సంతకాలూ ఉన్నాయని వారు వెల్లడించారు. పదేళ్ల క్రితం ఐఐటీలో సీటు రాలేదని చిన్నకొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు