యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు జడ్పీహెచ్ఎస్ కోయిలకొండ విద్యార్థి ఎంపిక!
కోయిలకొండ : మల్కాజ్‌గిరి జిల్లాలోని తూముకుంట గ్రామంలో ఈనెల 13 నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్న 70వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు కోయిలకొండ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థి/క్రీడాకారుడు విష్ణు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం నాడు క్రీడాకారుడు విష్ణును నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడారంగాల్లో కూడా విశేషంగా రాణించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకోవడం ఎంతోఅభినందనీయమని, రాష్ట్రస్థాయి పోటీలలో విష్ణు విజయం సాధించి పాఠశాలకు, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జ్ కుంభం శివకుమార్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి. శేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై. విద్యాసాగర్ గౌడ్, నాయకులు జీ. రవీందర్, వై. పవన్ కుమార్ గౌడ్, సత్యపాల్ రెడ్డి, రవి నాయక్, నారాయణరెడ్డి, తదితర ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


