కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం

విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు.. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని దేశిటిక్యాల గ్రామంలో ఎంపీ మల్లు రవి నిధులతో రూ.కోటి వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడంలో భాగంగా నూతన భవన నిర్మాణం చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునీందర్, వైస్ చైర్మన్ బాదం రమేష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నిరంజన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కా రాజు, మాజీ వార్డు కౌన్సిలర్ అమృతమ్మ, అచ్యుత రెడ్డి, కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పద్మ, నిజాం, పడిగే శంకర్‌తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు