ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి
-ప్రతి గొంతుక ప్రజాస్వామ్యంలో వినిపించాలి.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులైన డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని బిఆర్ఎస్వీ నాయకులు ఏర్పుల మహేష్ సూచించారు. అర్హులైన పట్టభద్రులు ఫారం - 18 ద్వారా తమ పేర్లను ఓటర్ల జాబితా లో నమోదు చేసుకోవాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, తమ హక్కును నిర్లక్ష్యం చేయకుండా నమోదు చేసుకోని తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు, ప్రభుత్వ రంగంలో ఉన్న అధికారులు అందరూ ఈ నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాము. పట్టభద్రుల గొంతుకను శాసనమండలిలో బలంగా వినిపించాలంటే ప్రతి అర్హుడైన పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ నాయకులు బూరుగు భరత్ గౌడ్, మకిలి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


