రైతులతో కలిసి మెగా రైతు మేళాను వీక్షించిన కలెక్టర్

రైతులతో కలిసి మెగా రైతు మేళాను వీక్షించిన కలెక్టర్

నిజామాబాద్  :  రైతాంగ శ్రేయస్సును కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వికారాబాద్ జిల్లా హకీంపేటలో  నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శన కార్యక్రమాన్ని, కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్నలతో నిర్వహించిన ఆత్మీయ సభను నిజామాబాద్ జిల్లాలోని రైతులు వర్చువల్ విధానంలో వీక్షించారు. జిల్లాలోని ఆయా మండలాల్లో 80 రైతు వేదికలలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు.
ఈ సందర్భంగా నవీపేట మండలం జన్నేపల్లి గ్రామంలోని రైతు వేదికలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక రైతులతో కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో పాటు రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆధునిక సాగు పద్ధతులు, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, రైతులకు అందుతున్న ప్రభుత్వ పథకాలు తదితర అంశాలను రైతులు ఆసక్తితో ఆలకించారు.
రైతు మేళాలో వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, నూతన సాగు విధానాలు, అధిక దిగుబడులు సాధించే పద్ధతులు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ప్రోత్సాహం తదితర అంశాల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.
    ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికత, మార్కెటింగ్ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల నెలకొని ఉన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా రబీలో వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరం కలిగిన ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. జన్నేపల్లి రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, తహసీల్దార్ వెంకటరమణ, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు

e3950ec1-8aba-4141-926e-75bbc0d3c7d2

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు