భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి

ఆరుతడి పంటలను సాగు చేయాలి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ , గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలన

భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి

గంభీరావుపేట, :  భూముల రీసర్వే పై రైతులు కనీస అవగాహన పెంచుకోవాలని, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహణ సమయంలో అధికారులకు సహకరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ బుధవారం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ సర్వే ప్రక్రియ చేపడుతున్న బృందం భూముల వివరాలను ఖచ్చితత్వంతో సేకరించాలని, రైతులకు భూముల రీ సర్వేపై అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు భూముల రీ సర్వే పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎల్ నినో నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు, అధికారుల సూచనలు రైతులు ఖచ్చితంగా పాటించాలని, వరికి బదులుగా ఇతర ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. జిల్లాలో ఆయిల్ పామ్, ఇతర కూరగాయల పంటలను సాగు చేస్తూ లాభాలు పొందుతున్న రైతుల అనుభవాలను తెలుసుకొని పంటలు సాగు చేయాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ మారుతి రెడ్డి, సర్వేయర్, సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Views: 66

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు