రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

-పెద్దమల్లారెడ్డి, కంచర్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించిన -- డీఆర్డీఓ దామోదర్ రెడ్డి

రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

భిక్కనూర్ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) దామోదర్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి కొనుగోళ్ల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం నాణ్యత, తేమ శాతాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించి కొనుగోళ్లు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కంచర్ల గ్రామంలో ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాల ద్వారా శుభ్రం చేస్తున్న రైతులతో మాట్లాడారు. జీపీఎస్ సౌకర్యం కలిగిన వాహనాల ద్వారానే కేటాయించిన గోదాములకు ధాన్యాన్ని తరలించాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రికార్డులు, సంబంధిత పత్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు సకాలంలో సేవలు అందిస్తూ, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీఆర్డీఓ దామోదర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం,సాయిలు, సి సి,ప్రమోద్, సీఏలు అధ్యక్షురాలు, రైతులుపాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు