కైసర్‌నగర్‌లో 2 బి హెచ్ కె ఇళ్ల పట్టాలు అందజేసిన కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మహాదేవపురం పరిధిలోని కైసర్‌నగర్‌లో 2 బి హెచ్కె ఇళ్లకు సంబంధించి గతంలోనే మంజూరైనప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాలను ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కొర్వి లక్ష్మి, మమతా, గౌసియా బేగమ్‌లకు 2 బి హెచ్ కె ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, డీసీసీ మైనారిటీ జనరల్ సెక్రటరీ షఫీ, వలీభాయ్, సరితా యాదవ్, యాద్గిరి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

