వాహనదారులకు శుభవార్త - ఇంటి నుంచే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ!

వాహన్ పోర్టల్ ద్వారా లైసెన్స్, బదిలీ, చిరునామా మార్పు సేవలు - డీటీఓ ఇమ్రాన్ అహ్మద్

వాహనదారులకు శుభవార్త - ఇంటి నుంచే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ!

నాగర్ కర్నూల్ : ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాహనదారులకు ఇంటి నుంచే ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని నాగర్‌కర్నూల్ జిల్లా డీటీఓ ఇమ్రాన్ అహ్మద్ తెలిపారు.వాహన్ పోర్టల్ ద్వారా పలు ఆర్టీఏ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, ఈ-కేవైసీ ద్వారా సేవలు మరింత సులభతరం అయ్యాయని తెలిపారు.వాహనాల అద్దె, యాజమాన్య బదిలీ సేవలు ఆన్‌లైన్‌లోనే పొందవచ్చని, వాహన రిజిస్ట్రేషన్‌లో చిరునామా మార్పునకు కూడా ఆన్‌లైన్ సదుపాయం ఉందని వివరించారు. ఆధార్ ఓటీపీ, ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

కొన్ని ప్రత్యేక సేవలకు మాత్రమే ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని, ఈ డిజిటల్ సేవల ద్వారా సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని డీటీఓ తెలిపారు. వాహనదారులు ఆన్‌లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీటీఓ ఇమ్రాన్ అహ్మద్ సూచించారు.

Views: 70

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు