ఆదిలాబాద్ జిల్లా,నర్సాపూర్ గ్రామంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం*
90 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్ల తనిఖీ
85 ఈ-చలాన్ కేసుల్లో రూ.16,570/- జరిమానా చెల్లింపు
రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచన
*గంజాయి, మాదకద్రవ్యాలు, గుడుంబా, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి..
ఎస్ హెచ్ ఓ ఇన్స్పెక్టర్ వి. ప్రవీణ్ కుమార్*
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో ఇచ్చోడ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలో ఉదయం 5 గంటల నుండి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 90 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్లను తనిఖీ చేసి వాహనదారులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనాల ఈ-చలాన్లను పరిశీలించగా 85 కేసులకు సంబంధించి రూ.16,570/- జరిమానాలను వాహనదారులు చెల్లించడం జరిగింది. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, నంబర్ ప్లేట్లు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అదేవిధంగా యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, గుడుంబా వంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. గ్రామంలో ఎలాంటి అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోఎస్ఐ విష్ణు ప్రకాష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


