డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
నూతన బోరు మోటారు ప్రారంభించిన సర్పంచ్ బండి స్వామి
మల్హర్ : గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో నూతన బోరు ఏర్పాటు చేసి మోటారు బిగించారు.ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు డీఎంఎస్‌టీ నిధుల నుంచి బోరు మంజూరు చేయగా, మోటారు ఏర్పాటు పనులు పూర్తయ్యాయి.ఈ సందర్భంగా గ్రామస్థుల సమక్షంలో సర్పంచ్ బండి స్వామి మోటారు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ ఏర్పాటుతో గూడపల్లి ప్రజలకు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు, వార్డు సభ్యులు పమిడి నిరంజన్ రావు, చల్లా మహేందర్ తో పాటు అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


