దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్

దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్

చౌటకూర్,;  సంగారెడ్డి జిల్లా పుల్కల్, చౌటకూర్ మండలాల పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా యువకులు, చిన్నారులు బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ సూచించారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
బాణసంచా కాల్చే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా చిన్నారులు ఒంటరిగా టపాసులు కాల్చకుండా తల్లిదండ్రులు తగిన పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. బాణసంచా కాల్చేందుకు సురక్షితమైన ప్రదేశాలను ఎంచుకోవాలని, ప్రజలకు మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, ఇతరులకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించకూడదని అన్నారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడవద్దని ఆయన హితవు పలికారు.
అలాగే పోలీసుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ విశ్వజన్ హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ, సురక్షితమైన రీతిలో దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్
డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
మోడల్ స్కూల్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.
చేగుంట బస్టాండ్ దుస్థితి మార్చే వారే లేరా
ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి