ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
అందోల్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలోని గడి పెద్దాపూర్ గ్రామంలో శనివారం ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల శేషారెడ్డి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఏపిఎం రుక్మిణి తెలిపారు.ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్మకం చేపట్టాలని రైతులకు వివరించడం జరిగింది. ఈకార్యక్రమంలో డిసిసి జిల్లా కార్యదర్శి బసన్న గారి బాలకిషన్,ఎస్సి సేల్ జిల్లా ఉపాధ్యక్షుడు బసన్న గారి బాల్ రాం,యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అభిలాష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ విఠల్ రెడ్డి,బీసీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింలు, సాయిబాబా,
యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రోషన్,
ఉప సర్పంచ్ నిర్మల శ్రీశైలం , వార్డ్ మెంబర్స్ సత్యనారాయణ, మల్లేశం, డైరెక్టర్ సాయిలు, చక్రపాణి, ఆంజనేయులు, ఆంజనేయులు, రంజిత్, ఐకెపి నిర్వాహకులు ఏఈఓ విఠల్ రావు రైతులు తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


