కరువు పరిస్థితులపై కలెక్టర్ సమీక్ష: ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం

కరువు పరిస్థితులపై కలెక్టర్ సమీక్ష: ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శుక్రవారం కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లాలో 13 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించిందని తెలిపారు. కరువు పరిస్థితులపై శాఖల వారీగా సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటి సరఫరాపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. బోర్లు, చేతిపంపులు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్ల పరిస్థితిని పరిశీలించాలని, నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు పంటల నష్టంపై సమగ్ర అంచనా వేయాలని, సాగునీటి లభ్యత, భూగర్భ జలమట్టాలపై నిరంతర పరిశీలన చేయాలని, రైతులకు అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మనోహరాబాద్ రైతు వేదికలో పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం మనోహరాబాద్ రైతు వేదికలో పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం
మనోహరాబాద్ : రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 24వ విడత నిధులను శుక్రవారం...
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి -- పోలీసుల విధులు, చట్టాలపై అవగాహన -- సీఐ శ్రీనివాస్
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలి -- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
బాలల హక్కులు రక్షణ చుట్టాల పై అవగాహన కల్పించిన సివిల్ జడ్జి
మండల పార్టీ నూతన కమిటీ ఖరారు
విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన
రేపు పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో గిరిప్రదక్షిణ