బకెట్ లో పడి 20 నెలల బాలుడి మృతి - ఎండబెట్లలో విషాదం
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం ఎండబెట్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి బకెట్లో పడి 20 నెలల బాలుడు లోకేశ్ మృతి చెందాడు.జంగయ్య, శివలీల దంపతులకు ఇద్దరు కుమార్తెల తర్వాత దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత జన్మించిన ఒక్కగానొక్క కుమారుడు లోకేశ్. మరో రెండు రోజుల్లో ఇంట్లో పెద్ద కుమార్తె శుభకార్యం ఉండడంతో కుటుంబ సభ్యులంతా పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బాలుడు నీటి బకెట్లో పడ్డాడు.ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. శుభకార్య సందడిలో ఉండాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకున్నది.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Oct 2026 14:43:13
కల్వకుర్తి : నవంబర్ 2న హైదరాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్న మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు బీజేపీ నాయకత్వం సన్నాహాలు ముమ్మరం...
