బెజగామ లో ఘనంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
- భక్తిశ్రద్ధలతో అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు - అమ్మవారి దివ్య ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలి - ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్ నక్కిర్త గోపాల్
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా శుక్రవారం బెజగామ గ్రామంలోని ఉత్సవ మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ నక్కిర్త గోపాల్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం సంతోషదాయకమని తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ సతీష్ గౌడ్, గ్రామ పరిపాలనాధికారి, గ్రామ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రముఖులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


