వైద్య సేవలను వినియోగించుకోవాలి
చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్
మందమర్రి, (మంచిర్యాల) : సింగరేణి ఏరియా ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవలను కార్మిక,కార్మిక కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని సీఎంఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ విభాగాలు,క్యాజువాలిటీ వార్డు లతో పాటు ఇతర వైద్య సేవల విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులు,నర్సింగ్ సిబ్బంది,పారా మెడికల్ సమిష్టి కృషితో నాణ్యమైన,మెరుగైన వైద్య సేవలను కార్మికులకు,కుటుంబ సభ్యులకు అందించాలని పేర్కొన్నారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెంట ఆసుపత్రి సూపరిండెండెంట్ మధు కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మదార్ సాహెబ్,వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
