ఆర్కే ఓసి ఫేస్ 2 పనుల పరిశీలన
మందమర్రి, (మంచిర్యాల) : ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులు,ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లను ఆ సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కే.వెంకటేశ్వర్లు సోమవారం విసృతంగా పరిశీలించారు. అందులో భాగంగా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్ -2 ప్రాజెక్ట్ పనులపై ఆరా తీశారు. పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న అటవీ పునరుద్ధరణ, ఫారెస్ట్ క్లియరెన్స్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కేకే ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శాంతిఖని,కాసిపేట గనుల మ్యాప్ పరిశీలించారు. స్టోవింగ్ బంకర్, సైడింగ్ లను తనిఖీ చేశారు. ఉద్యోగుల శిక్షణ, మానవ వనరులపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, ఎస్ఓటుజిఎం లిలిత్ ప్రసాద్, ఈ అండ్ ఏం బాలాజీ భగవతి ఝా,గని మేనేజర్లు,సర్వేయర్లు ఉన్నారు.
Views: 97
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
