నాణ్యమైన విత్తనాలను  వినియోగించి అధిక దిగుబడులు సాధించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నాణ్యమైన విత్తనాలను  వినియోగించి అధిక దిగుబడులు సాధించాలి

నల్లబెల్లి, వరంగల్ : ఖరీఫ్ సీజన్‌లో రైతులు నాణ్యమైన విత్తనాలను  వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ధ్రువీకరించిన విత్తనాల స్టాళ్లను సందర్శించి, వాటి నాణ్యత, అందుబాటు, వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.వరికి బదులు ఆరుతడి పంటలు అయినా కందులు, పెసర్లు వేయాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు గుర్తింపు పొందిన సంస్థల ద్వారా సరఫరా చేసే ధ్రువీకరించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, విత్తనాల సంచులపై ఉన్న వివరాలను పరిశీలించిన తర్వాతే వినియోగించాలని అన్నారు .వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని, రైతులు ప్రభుత్వ సూచనలను పాటించి శాస్త్రీయ విధానంలో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ గారు సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ  అధికారులు హార్టికల్చర్ డీహెచ్ఎస్ వో శ్రీనివాస్, సహాయ సంచాలకులు, నర్సంపేట బొమ్మేనా శ్రీనివాస్, వ్యవసాయ అధికారి బన్న రజిత, మేడపల్లి సర్పంచ్ అర్రే సాంబయ్య, రాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ భారతమ్మ, ఏఈఓలు రంజిత్, రాకేష్, శివకుమార్, త్రివేణి, రైతులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
IMG_20260728_072802
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ