జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డబ్ల్యూ జే ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రాజ్జు భయ్యా నేతృత్వంలో సంఘం ప్రతినిధులు ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హోదా లభించిన సందర్భంగా డబ్ల్యూ జే ఐ నాయకులు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా అభినందించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జిల్లా అడ్‌హక్ కమిటీ కన్వీనర్ కటిక రవీందర్, డబ్ల్యూ జే ఐ నాయకులు మనోహర్ గౌడ్, బాలరాజు, అనిల్, రాఘవేందర్, దిలీప్, రవికుమార్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రంపై స్పందించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Views: 89
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
