మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్.

9 వాహనాలు స్వాధీనం

మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్.

మహబూబ్‌నగర్ : జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ మోటారు సైకిళ్లు నడుపుతున్న 9 మంది మైనర్లను గుర్తించి, వారి వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం మోటారు వాహనాల చట్టం ప్రకారం సంబంధిత జరిమానాలు విధించారు. అనంతరం మైనర్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, మైనర్ వయస్సులో వాహనాలు నడపడం వల్ల సంభవించే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలు, రహదారి భద్రతపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర లేదా ఇతర మోటారు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మైనర్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు సంభవిస్తే, పరిస్థితులను బట్టి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై కూడా సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజల ప్రాణాల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, మైనర్ డ్రైవింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు.
 
 
Views: 129

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ