శివంపేట బీర్ ఫ్యాక్టరీపై మరోసారి కాలుష్య ఆరోపణలు

శివంపేట బీర్ ఫ్యాక్టరీపై మరోసారి కాలుష్య ఆరోపణలు

  • వర్షపు రాత్రుల్లోనే వ్యర్థ జలాల విడుదల చేస్తున్నారని గ్రామస్తుల ఆందోళన
  • మంజీరా నది కలుషితమవుతోందని ఆరోపణలు
  • అధికారుల మౌనంపై గ్రామస్తుల అసంతృప్తి

చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట సమీపంలోని బీర్ ఫ్యాక్టరీపై గ్రామస్తులు మరోసారి కాలుష్య ఆరోపణలు చేస్తున్నారు. వర్షం కురిసే రాత్రి వేళల్లో ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలను విడుదల చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయం లో ఎవరూ గమనించరనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.ఈ వ్యర్థ జలాలు మంజీరా నదిలో కలవడం వల్ల నది నీరు కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున మాత్రం ఫ్యాక్టరీ యాజమాన్యం విడుదలవుతున్నది వర్షపు నీరేనని చెబుతోందని గ్రామస్తులు అంటున్నారు. రాత్రి సమయంలో కాలుష్య జలాలు, ఉదయం మాత్రం వర్షపు నీరని చెప్పడం ద్వారా వాస్తవాలను దాచిపెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.ఈ అంశంపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు సమగ్ర విచారణ చేపట్టకపోవడం, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న నీటిపై స్వతంత్రంగా నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి, నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ