రైతులకు అధిక లాభాలు అందించే ఫార్మ్ ఆయిల్ పంట సాగుకు ప్రభుత్వం కృషి

రైతులకు అధిక లాభాలు అందించే ఫార్మ్ ఆయిల్  పంట సాగుకు ప్రభుత్వం కృషి

ఉట్నూర్ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ, శాస్రవేత్తల సూచనల పాటిస్తూ పంటలు పండించి రైతులు బాగుపడాలని అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాగు పద్ధతుల్లో మార్పులు తెచ్చుకోవాలని, పూర్వకాలపు సేంద్రియ విధానాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. మనుషుల నిర్లక్ష్యం, కాలుష్యం వల్లే ఎల్-నినో వంటి ప్రతికూల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాగు, సాగు నీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఇళ్లు, పొలాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ప్రైవేట్ వ్యాపారులు చెప్పే ఆచరణ సాధ్యంకాని హైబ్రిడ్ విత్తనాలు, హోమియో ఫెర్టిలైజర్ల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్నిచ్చే 'ఆయిల్ పామ్' సాగును ప్రోత్సహించేందుకు మన ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రతీ రైతు తమ పొలం గట్లపై చెట్లు నాటాలని, వ్యవసాయ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సరైన మార్గదర్శనం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యవసాయ అధికారులను, ఆదర్శ రైతులను కలెక్టర్, ఎమ్మెల్యే మెమెంటోలను అందజేసి అభినందించారు. అనంతరం రైతులకు మొక్కలను అందించి, రైతువేదికలో ఏర్పాటు చేసిన స్టాల్ లను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆర్డీఓ మోహన్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్, ఏంఆర్ఓ రఘునాథ్, ఎంపీడీవో రైసుద్దీన్, ఎడిఏలు శ్రీధర్, రామ్ కిషన్, ప్యాక్స్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ అనిత, మండల వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ, ఉద్యాన, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ