రేపరేపలాడిన మువ్వన్నెల జెండా
దేశభక్తి నినాదాలతో మార్మోగిన వెల్దుర్తి
మెదక్ జిల్లా: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వెల్దుర్తి MRO విజయలక్ష్మి జెండా ఎగురావేశారు. "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై, ప్రభుత్వ కార్యాలయాలపై, పాఠశాలలపై మువ్వన్నెల జాతీయ జెండా గర్వంగా రేపరేపలాడింది. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ చేతిలో జెండా పట్టుకుని "భారత్ మాతా కీ జై" నినాదాలతో దేశభక్తిని చాటారు.ప్రధాన కూడలిలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు.పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలతో కార్యక్రమానికి మరింత శోభ తెచ్చారు. వీధులన్నీ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కళకళలాడాయి.దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటమే మన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 18:04:59
పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్
ఎరువుల తనిఖీ.. నానో యూరియా అందివ్వాలని ఆదేశం
