నియోజకవర్గ అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నియోజకవర్గ అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం:  ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం చిల్పూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన యాబై మంది యువకులు, ముదిరాజ్ కులస్తులు, బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రేస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనిలోని ఎమ్మెల్యే నివాసంలో పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జక్కుల వీరయ్య, చొక్కం సంపత్, చొక్కం రమేష్, రాజు, నాగరాజు, అజయ్, లింగనబోయిన రమేష్, ఇట్టబోయిన రాజశేఖర్, రాయగిరి సత్యం, పెద్ద వీరయ్య, మోతె రాహుల్, రంజిత్ తో పాటు మరో ముప్పై మంది ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ఆకర్శితులై పార్టీలో చేరుచున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు గౌడ్, కొండాపూర్ గ్రామ ఉప సర్పంచ్ నరేష్, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. 
Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ : ​నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 
రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి