మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం..
ఆదిలక్ష్మికి చేయూతనిచ్చిన లయన్స్ క్లబ్ సభ్యులు
కొత్తగూడెం:లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లినియం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పేద వృద్ధురాలికి నెలరోజు లకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ సమీపంలోని పూయిన్ బస్తికి చెందిన శానం ఆదిలక్ష్మి అనే వృద్ధురాలికి బియ్యం, పప్పులు, వంటనూనెతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను అందజేసి ఆమెకు చేయూత నిచ్చారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ, సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు తమ వంతు సహాయం అందించడం క్లబ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లినియం అధ్యక్షులు లయన్ దోతి బాబురావు, కార్యదర్శి లయన్ పగడాల నాగేష్, ఎంజేఎఫ్ లయన్ రాయల శాంతయ్య, ఎంజేఎఫ్ లయన్ పితాని సత్యనారాయణ, లయన్ పల్లెపు వెంకన్న, లయన్ నాగలక్ష్మి, లయన్ గుబ్బల వాసు తదితరులు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 18:22:56
నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
