చౌటకూర్‌లో రాత్రివేళల్లో మొరం టిప్పర్ల రవాణా.. మైనింగ్ అనుమతులపై స్థానికుల ప్రశ్నలు!

అనుమతులు ఉంటే పగటిపూట రవాణా ఎందుకు చేయడం లేదు?: స్థానికులు హైవే సర్వీస్ రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం రైతుల తప్పే: ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ ప్రతినిధి శ్రీనివాస చారి

చౌటకూర్‌లో రాత్రివేళల్లో మొరం టిప్పర్ల రవాణా.. మైనింగ్ అనుమతులపై స్థానికుల ప్రశ్నలు!

చౌటకూర్ :  సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌ఎన్ (SLN) గ్రూప్ వెంచర్లకు మొరం తరలింపు వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. మైనింగ్ అనుమతులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, మొరం టిప్పర్ల రాకపోకలు ప్రధానంగా రాత్రి వేళల్లోనే ఎందుకు కొనసాగుతున్నాయని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల సూచన మేరకే రాత్రివేళల్లో రవాణా: శ్రీనివాస చారి ఈ వ్యవహారంపై ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ ప్రతినిధి శ్రీనివాస చారిని వివరణ కోరగా.. మైనింగ్ అనుమతులు తీసుకున్న తర్వాతే మొరం తవ్వకం, రవాణా పనులను కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు తెలిపారు. వెంచర్ల అభివృద్ధి కోసం సుమారు ఎనిమిది నెలల పాటు మొరం సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని, ఇందుకు మొత్తం వెయ్యి టిప్పర్ల వరకు మొరం అవసరమవుతుందని ఆయన వివరించారు. కాంట్రాక్టర్ల సూచనల మేరకే రాత్రి వేళల్లో మొరం లోడింగ్, రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. పగటిపూట ఎందుకు రవాణా చేయడం లేదని ప్రశ్నించగా, కాంట్రాక్టర్ల విధివిధానాల ప్రకారమే పనులు జరుగుతున్నాయని ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం తమ సంస్థ ఆధ్వర్యంలో సుమారు తొమ్మిది వెంచర్లు కొనసాగుతున్నాయని, హైదరాబాద్‌లోని సుచిత్ర ప్రాంతంలో తమ ప్రధాన కార్యాలయం ఉందని శ్రీనివాస చారి వెల్లడించారు. ప్రమాదాల భయంతో స్థానికుల ఆందోళన రాత్రి వేళల్లో మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న భారీ టిప్పర్ల వల్ల ద్విచక్ర వాహనదారులు, చిన్న వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ వాహనాల రాకపోకలపై సంబంధిత అధికారులు నిఘా ఉంచి పర్యవేక్షించాలని వారు కోరుతున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడంపై వ్యాఖ్యలు ఇదిలా ఉండగా, జాతీయ రహదారి సర్వీస్ రోడ్లపై రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టే అంశాన్ని శ్రీనివాస చారి దృష్టికి తీసుకెళ్లగా.. రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ రోడ్లపై ధాన్యం పోయడం రైతుల తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు. తాము హైవేపై ప్రయాణించేటప్పుడు కూడా సర్వీస్ రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం కనిపిస్తోందని పేర్కొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం
తిరుపతి :  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత
బెల్లంపల్లిలో మైనార్టీ ఫంక్షన్ హాల్ కలగానే మిగిలిపోతుందా?
చౌటుకూరు మండల కేంద్రంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు పోలియో చుక్కలు
చౌటకూర్‌లో రాత్రివేళల్లో మొరం టిప్పర్ల రవాణా.. మైనింగ్ అనుమతులపై స్థానికుల ప్రశ్నలు!
రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి..!
సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వాల్సిన గౌరవ వందనం ఒవైసీకి..!