రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగరేణి కార్మికుడి కుటుంబానికి బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు కోటి రూపాయల బీమా చెక్కును శనివారం నాడు అందజేసింది. గత మార్చి 23వ తేదీన బొక్కలగుట్ట రాళ్లవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కె కె 5 గనిలో పనిచేసే సింగరేణి కార్మికుడు పోసిని వెంకటస్వామి(45) మరణించాడు. స్థానిక హనుమాన్ బస్తీకి చెందిన వెంకటస్వామికి బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు లో జీతం ఖాతా ఉండడం వల్ల అతని నామినిగా ఉన్న భార్య సుమలతకు కోటి రూపాయల బీమా చెక్కును బ్యాంకు చీఫ్ మేనేజర్ చందన్ కుమార్, సీనియర్ మేనేజర్ తరుణ్ సింగ్, బ్యాంకు ఆర్డీవో విజయ్ సంజయ్ చేతుల మీదుగా ఈ బీమా డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు చీఫ్ మేనేజర్ చందన్ కుమార్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు లో ఖాతా కలిగిన ప్రతి ఒక్క బ్యాంకు వినియోగదారుడు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

