నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల కేసులో ఐదుగురి అరెస్టు

మరో నిందితుడు పరారీ.. డిజిటల్ సంతకాల దుర్వినియోగంతో అక్రమంగా సర్టిఫికెట్ల జారీ

నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల కేసులో ఐదుగురి అరెస్టు

బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా):  అనధికారికంగా మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. బెల్లంపల్లి ఎంపీఓ గుమ్ముల కృష్ణవేణి ఈ నెల 17న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఎంపీఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న చిందం శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసి అక్రమంగా సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించారు. బెల్లంపల్లి మండలం బుద్ధఖుర్ద్ గ్రామంలో కారోబార్ చిందం రవి సహకారంతో 16 మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా పెర్కపల్లి గ్రామ పంచాయతీలో మరో 11 సర్టిఫికెట్లు ఎలాంటి అనుమతి లేకుండా జారీ చేసినట్లు గుర్తించారు. వీటిలో ఒకటి పెర్కపల్లికి, మిగిలిన పది పెద్దపల్లి జిల్లాకు సంబంధించినవిగా పేర్కొన్నారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ సంతకాలను వారి అనుమతి లేకుండా ఉపయోగించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ వైకుంఠం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆనంద్, సాగర్, గోదావరిఖని మీ సేవ ఆపరేటర్ నరేందర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేయగా, మంచిర్యాలకు చెందిన వైకుంఠం పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Views: 73

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం
తిరుపతి :  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత
బెల్లంపల్లిలో మైనార్టీ ఫంక్షన్ హాల్ కలగానే మిగిలిపోతుందా?
చౌటుకూరు మండల కేంద్రంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు పోలియో చుక్కలు
చౌటకూర్‌లో రాత్రివేళల్లో మొరం టిప్పర్ల రవాణా.. మైనింగ్ అనుమతులపై స్థానికుల ప్రశ్నలు!
రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి..!
సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వాల్సిన గౌరవ వందనం ఒవైసీకి..!